heaven on the world

Tuesday, 29 November 2016

శ్రీ జ్ఞాన సరస్వతీ సంపూర్ణానుగ్రహ సిద్దిరస్తు

ॐॐ త్రిశక్తి రూపిణీం అంబా దుర్గాం చండీం నమామ్యహమ్ 'ఓం శ్రీ సరస్వతై నమః ॐॐ
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ |

"ఈ రోజు ఆశ్వయుజ శుద్ద షష్టి సోమవారము మూల నక్షత్రము."
ఈ రోజు విజయవాడలోని కనకదుర్గా దేవి " శ్రీ సరస్వతీ దేవి "
అలంకారమున భక్తులన అనుగ్రహిస్తున్నారు .




'శ్లో !!
మాణిక్యవీణాం ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ !
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి !!
*తా:
అత్యుత్తమ మైన వీణను శ్రావ్యముగా వాయించు నట్టియు ,
యౌవన సౌందర్య వైభవము గలిగి
నట్టియు , కులుకు పలుకుల బెళుకులు కలిగి నట్టియు ,
శ్రేష్ఠమగు ఇంద్ర నీల మణి కాంతి మెఱుపులచే
మనోహరమగు నవయవములు కలిగినట్టియు ,
మతంగ మహర్షి కుమార్తె యైనట్టి యా దేవిని మనసారా స్మరించు చున్నాను ...




*కాళరాత్రి*
"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.



కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.




కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.
ఆశ్వయుజ శు.సప్తమి కాళరాత్రి ( సరస్వతి ) నైవేద్యం : తెలుపురంగు ఆహార నివేదన'
॥ శ్రీ జ్ఞాన సరస్వతీ సంపూర్ణానుగ్రహ సిద్దిరస్తు!!

No comments:

Post a Comment