heaven on the world

Tuesday, 29 November 2016

నవదుర్గలు
. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.
ధ్యానం
యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం
యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా
యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం
నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ
ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక.
నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే
నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది.
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది
నవదుర్గలు
సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.
ప్రథమం శైల పుత్రీతి
ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్ర ఘంటేతి
కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి
షష్ఠం కాత్యాయనీతి చ
సప్తమం కాలరాత్రీతి
మహాగౌరీతి చాష్టమం
నవమం సిద్ధిదా ప్రోక్తా
నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని వుంది. అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు.
శైలపుత్రి
సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.
ఆశ్వయుజ శు.పాడ్యమి శనివారం శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి) నైవేద్యం : కట్టు పొంగలి
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


"తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః|
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం||"
ఈ శ్లోకం 'శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం' లోనిది. కవి పేరు పండిత దైవజ్ఞ సూర్య సూరి. 14వ శతాబ్దపు, దివిసీమ తాలూకా కవి.
ఈ శ్లోక విశేషమేమిటంటే మొదటినుంచి చివరకు చదివినా, చివరనుంచి వెనుకకు చదివినా ఒకేలాగ ఉంటుంది, అంటే వికటకవి లాగా అన్నమాట. ఇంగ్లీషులో దీనిని ప్యాలిన్డ్రోమ్ అంటారు. అర్థభేదం మాత్రం ఉంటుంది.
👉 ఎడమనుండి కుడికి చదివినప్పుడు శ్రీరామ పరంగానూ, కుడినుండి ఎడమకు చదివినప్పుడు శ్రీకృష్ణ పరంగానూ ఉంటుంది. చూడండి, ఎడమనుండి చదివినప్పుడు 'ఎవరైతే సీతను రక్షించారో, ఎవరి చిరునవ్వు మనోమోహకంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భుతమో, ఎవరినుండైతే దయ, అద్భుతమూ అన్నిచోట్లా వర్షిస్తుందో అట్టి శ్రీరామునికి నమస్కరిస్తున్నాను,' అనే అర్థం వస్తుంది.
👉 అదే కుడినుండి ఎడమకు చదివినప్పుడు 'శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైనట్టి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను,' అని అర్థం వస్తుంది.
👉ఎంత ఘనమైన కవిత. ప్యాలిన్డ్రోమ్ ల ఆంగ్ల భాషా ప్రియులేమంటారో

No comments:

Post a Comment