heaven on the world

Tuesday, 29 November 2016

ఆరెంజ్ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవిస్తే.పొట్ట, ఉబ్బసం వంటివి తగ్గిపోతాయి.

ఆరెంజ్ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవిస్తే...... కమలారసంలో ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవించినా, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు వచ్చే పొట్ట, ఉబ్బసం వంటివి తగ్గిపోతాయి. మూత్రంలో చురుకు, మంట ఉన్న వారు కమలారసంలో లేత కొబ్బరి నీటిని కలిపి సేవిస్తే పై బాధలు తగ్గిపోతాయి కూడా. క్రీడాకారులు విటమిన్‌ సి, ఇ, తేనెలతో పాటు కమలారసాన్ని సేవిస్తే నూతనోత్సాహంతో ఉంటారు. 

షేర్ చేయండి share this





ముఖ్యంగా టీబీ, టైఫాయిడ్‌ లాంటి వాటితో బాధపడే వారికి కమలారసం మంచి శక్తినిచ్చి వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుందని వైద్యులు చెపుతున్నారు. ఆరోగ్యవంతులు ఈ పళ్ళ రసాన్ని తాగడం వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, తుమ్ముల నుంచి దూరంగా ఉంచుతుంది. నిత్యం కమలారసం సేవించే వారు మంచి ఆరోగ్యంతో ఉంటారని వైద్య పరిశోధనల్లో వెల్లడైంది.




ఈ పండును ఆరగించడం వల్ల కాలేయం, గుండె, మూత్రపిండాలను సక్రమంగా పని చేయించే శక్తిని పెంచుతుంది. అలాగే, దగ్గు, ఆయాసం, టీబీ ఉన్న వారు గ్లాస్‌ కమలారసంలో చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి తాగితే మంచి శక్తి కలిగి ఉత్సాహంగా ఉంటారు.

No comments:

Post a Comment