heaven on the world

Tuesday, 15 November 2016

పెద్ద నోట్ల దెబ్బ నుంచి గాలి ఇలా గట్టెక్కారు As the gali passes from the blow notes..

గాలి జనార్దన్‌ రెడ్డి తన కూతురి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నసమయంలోనే పెద్ద నోట్లను రద్దు చేశారు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి అంటే గిట్టని మీడియా సంస్థలు తెగ సంబరపడిపోయి కథనాలు రాసుకున్నాయి. ”గాలి గిలగిల” అని కొన్ని ఛానళ్లు, ”ఇప్పుడు గాలి గట్టెక్కేది ఎలా” అని మరికొన్ని ఛానళ్లు కథనాలు రాశాయి. అయితే గాలి జనార్దన్‌ రెడ్డికి పెద్దనోట్ల ఎఫెక్ట్ లేదని తెలుస్తోంది.
ఎందుకంటే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆరు నెలల క్రితమే ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ సంస్థకు గాలి జనార్దన్‌ రెడ్డి అప్పగించేశారు. పెళ్లి సెట్టింగ్ నుంచి, భోజనాల వరకు, రవాణా నుంచి అతిథులకు బస ఏర్పాటు వరకు అన్ని పనులను ఆరు నెలల ముందే ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు గాలి జనార్దన్ రెడ్డి అప్పగించారు. మనీ సెటిల్‌మెంట్లు కూడా ముందే పూర్తయిపోయాయి.  ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా చేస్తాయన్న అనుమానానికి కూడా సమాధానం దొరికింది. తమకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదని, ఆన్‌లైన్‌ ద్వారానే డబ్బు లావాదేవీలు చేయగలమని చెబుతున్నారు. మిగిలిన ఏర్పాట్లకు సంబంధించి సొమ్మును పెద్దనోట్ల రద్దు వల్ల గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికప్పుడు చెల్లించలేకపోయినా… వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటున్నారు.



గాలి జనార్దన్‌ రెడ్డి ఒక్క మాట అడగాలే గానీ ఇప్పటికిప్పుడే డబ్బు అడగకుండా నోటి మాట మీద అన్ని పనులు చేసి పెట్టే వారు చాలా మంది ఉన్నారంటున్నారు. పెద్దనోట్ల రద్దుతో గాలి ఇంటి పెళ్లి అయోమయంలో పడిదంటూ అసూయ, ధ్వేషంతో కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసుకుంటున్నాయని గాలి సన్నిహితులు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి మీద కోపం ఉండవచ్చు గానీ… ఒక కూతురి వివాహంపైనా ఇలా శాడిస్ట్‌ కథనాలు వడ్డించడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం అంటున్నారు

No comments:

Post a Comment